ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిరసన


                  జామియా ఘటనకు వ్యతిరేకంగ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా న్యూ ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ధర్నా చేసారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు తెలిపారు.జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేతను ప్రియాంక గాంధీ ఖండించారు.  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడి చేశారు మరియు ధిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై అణిచివేత "భారతదేశం యొక్క ఆత్మపై దాడి" అని అన్నారు."ప్రభుత్వం రాజ్యాంగాన్ని దెబ్బ తీస్తోంది ,ఇది దేశం యొక్క ఆత్మపై దాడి, యువత దేశం యొక్క ఆత్మ. నిరసన తెలపడం వారి హక్కు ”అని గాంధీ అన్నారు.కాంగ్రెస్ నేత రణ దీప్ సింగ్ సూర్జేవాలా జామియా క్యాంపస్‌లో పోలీసు చర్యను "దౌర్జన్యం" అని పేర్కొన్నారు . సీనియర్ కాంగ్రెస్ నేతలు రెండు గంటల పాటు ఇండియాగేట్ వద్ద ధర్నా కు దిగి తమ నిరసనను తెలియజేసారు. ఈ ధర్నా లో ప్రియాంక తో పాటు కాంగ్రెస్ నేతలు ఆ కె అంథోని, అహ్మాద్ పటేల్,కే సి వేణుగోపాల్,పి ఎల్ పూనియా తదితరులు పాల్గొన్నారు