తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ గ వున్న బుసాని వెంకటేశ్వర్రావు ను రెవిన్యూ శాఖ లోని విపత్తు నిర్వహణ శాఖా ముఖ్య కార్యదర్శి గా , పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డా. ఏ . అశోక్ ను డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ గ నియమించారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహమద్ ను ఎక్సయిజ్ శాఖ కమిషనర్ గ నియమించారు. జోగులాంబ గద్వాల్ కలెక్టర్ గ వున్నా కే.శశాంక ను కరీంనగర్ కలెక్టర్ గ నియమించారు. వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి జోగులాంబ గద్వాల కలెక్టర్ గ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు .