ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాధ్ రెడ్డి

                             


                   సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి ఎపి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ (ఎపిపిఎ) ఛైర్మన్‌గా నియమించింది . దీనికి సంబంధించి   శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి .కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో ఉన్నారు.


                 ఆయన రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎత్తిచూపే రచనలకు పేరుగాంచారు. ఆంధ్రప్రభ ,ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలకు పనిచేసిన శ్రీనాథ్ రెడ్డి, తరువాత కొంతకాలం సాక్షి తెలుగు డైలీతో కలిసి పనిచేశారు. శ్రీనాథ్ రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.